Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఆయన ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు 23వ ఇండో–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా భారత్‌పై వాణిజ్య ఆంక్షలు విధిస్తున్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
పుతిన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరగనున్నాయి. రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు స్వాగతం పలుకనున్నారు. పుతిన్ రాకతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని భావిస్తున్నారు. కాగా, ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ పర్యటనను ప్రకటించగా, సెప్టెంబరులో చైనాలో జరిగిన SCO సమావేశంలో మోదీ–పుతిన్ చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
డిసెంబర్ 4,5 తేదీల్లో ఇండియాకు పుతిన్