బుధవారం ఆటో రిక్షా, బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వ్యవసాయ కూలీలను పనికి తీసుకెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సూర్యాపేట జిల్లా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆటో రిక్షాలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కందుల నార్దన, చెవుల నారాయణమ్మ, పోకల అనసూర్య. వీరు మునుగాల మండల వాసులు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.