హైదరాబాద్: మియాపూర్‌లోని సిఆర్‌పిఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన పరంధామన్ (56) ఛాతిలో నొప్పి వస్తుందని తోటి అధికారులకు ఫిర్యాదు చేసి కుప్పకూలిపోయాడు.
వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పరంధామన్‌కు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.