మహబూబాబాద్‌కు చెందిన శిరీష (24) అనే మహిళ చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది.గ్రూప్ IV పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించాననే మనస్తాపంతో చిక్కడపల్లిలోని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్‌ IVలో తక్కువ మార్కులు సాధించి డిప్రెషన్‌లోకి జారుకున్న మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *