అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.