హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులు ఇక నుంచి నేరుగా శాస్త్రవేత్తలతో సంభాషించవచ్చని వ్యవసాయ శాఖ కమిషనర్ బి.గోపి తెలిపారు. ఈ సదుపాయాన్ని ఇటీవల రాష్ట్రంలోని 110 రైతు వేదికలలో ప్రారంభించారు. ఇందులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, విపరీతమైన వేడి కారణంగా మామిడి మొగ్గలు రాలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రైతులు నేరుగా వేదికల వద్ద సంప్రదించవచ్చు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
