విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం జీఎస్టీ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ ట్యాక్స్ కోసం జీఎస్టీవో ఎన్.కిషోర్ కుమార్‌ను జీడిపప్పు వ్యాపారి సంప్రదించాడు. దీని కోసం కిషోర్ కుమార్ ₹1.5 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు. బ్యూరో సలహా మేరకు, వ్యాపారి జీఎస్టీ అధికారికి ₹ 1 లక్ష ఇవ్వాలని ప్రతిపాదించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో కలిసి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.