₹5 Breakfast Scheme in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందిస్తున్న రూ.5 భోజన పథకాన్ని మరింత విస్తరిస్తూ, అదే ధరకు బ్రేక్ ఫాస్ట్ కూడా అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు. ప్రారంభ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలోని 139 కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తుండగా, మొదటి దశలో 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ స్కీమ్ అమలు చేయనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు మిల్లెట్ ఆధారిత ఇడ్లీ, పూరి, పొంగల్, ఉప్మా లాంటి పౌష్టిక టిఫిన్లు అందించనున్నారు. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చవుతున్నా ప్రజల నుంచి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తూ, మిగిలిన రూ.14ను జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ క్యాంటీన్ల సంఖ్యను త్వరలోనే 150కు పెంచనున్నారు.
ఇంతకుముందు ఉపయోగించిన స్టాల్స్ పూర్తిగా దెబ్బతినడంతో, కొత్తగా రూ.11.43 కోట్ల వ్యయంతో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్కీమ్ బస్తీ ప్రజలు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగుల కోసం పెద్ద ఉపశమనం కలిగించనుంది. ప్రస్తుతం రూ.5 భోజనాన్ని విజయవంతంగా అందిస్తున్న హరే రామ హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా నిర్వహించనుంది.
Internal Links:
తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షల తేదీ వచ్చేసిందోచ్..
External Links:
ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్