హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్‌గిరిగుట్ట, దుండిగల్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అదేవిధంగా మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయలో వర్షం కురుస్తోంది. నగరమంతా మేఘావృతమై ఉంది. ఇక రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొండమల్లేపల్లిలో 6.84 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా చందంపేటలో 5.91, నిడమనూరులో 4.45, గుండ్లపల్లిలో 4.98, పెద్దఅడిసర్లపల్లిలో 3.87, నాగర్‌కర్నూల్ జిల్లా పదరలో 4.19, ఉప్పనూటలో 4.16, రంగూరు జిల్లా మాడ్గులులో 3.88 సెం.మీ. 4.05 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది.