ప్రముఖ తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్టాలలో చర్చగా మారిన విషయం తెలిసిందే. లావణ్య , రాజ్ తరుణ్ తనతో గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్, మాల్వి కలిసి తిరుగుతున్నారని మరియు గోవా, పుదుచ్చేరి, చెన్నై మరియు ఇతర ప్రాంతాలకు తరచుగా కలిసి వెళుతున్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజాగా తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులైన బసవరాజు, రాజ్యలక్మి మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుండగా లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి, కాలింగ్ బెల్ కొడుతూ, తలుపులను తంతు విధ్వసం చేసింది. ఇట్టి విషయంపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, లావణ్య పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తమని ఇబ్బందికి గురి చేస్తుందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.