Almont Kid Syrup: పిల్లలకు వాడే ఆల్మంట్-కిడ్ సిరప్ కలుషితమై విషపూరితంగా మారిందని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఈ సిరప్‌లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్టు గుర్తించడంతో, తల్లిదండ్రులు వెంటనే ఈ సిరప్ వాడటం ఆపాలని సూచించారు. ఈ సమాచారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (కోల్‌కతా) నుంచి వచ్చినట్టు తెలిపారు. ఎవరి వద్దైనా ఈ సిరప్ ఉంటే, సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు తెలియజేయాలని, అలాగే సహాయానికి టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969ను సంప్రదించాలని సూచించారు.
దీంతో ఆల్మంట్-కిడ్ సిరప్ అమ్మకాలను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించారు. డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులకు ఈ సిరప్‌కు సంబంధించిన స్టాక్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచించారు. కల్తీ అయిన సిరప్ వివరాలు: ఆల్మంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం), బ్యాచ్ నెం. AL-24002, తయారీ తేదీ జనవరి-2025, గడువు తేదీ డిసెంబర్-2026.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్.. వాడొద్దంటూ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ వార్నింగ్