సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం పై ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉచిత బస్సు ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫేస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా ఇంకా అమలు చేయలేదు అని విమర్శలు వస్తున్నాయి.
కానీ తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందిస్తూ. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని మంత్రి అనగాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ట్విట్టర్ వేదికగా తెలపడంతో మహిళలకు ఫ్రీబస్సు సౌకర్యం ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.