ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు మరణించిన ఘటన వారి కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో చోటుచేసుకుంది. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు గుంటలో పడి ఊపిరాడక మరణించారు. యువకులు ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు పోలీసులు గాలింపులు చెప్పటగా, యువకుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నీటి గుంటలో ఒక మృతదేహాన్ని గుర్తించారు అని తెలిపారు. ఆ గుర్తించిన మృతదేహాన్ని నవీన్ అనే యువకుడిగా పేర్కొన్నారు. మరో యువకుడైన వెంకటేశ్వర్లు మృతదేహం మాత్రం లభ్యం కాలేదు అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.