ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, టిటిడి అధికారులు ఆమెకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.
ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా తన తలనీలాలు వెంకటేశ్వరస్వామికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని స్వల్ప గాయాలతో బయటపడిన తర్వాత ఆమె స్వామివారి దర్శనానికి వచ్చారు.