AP Cinematography Minister: ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో సమావేశం కానున్నారు. టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఈ భేటీలో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్, సినీ కార్మికుల సమస్యలు, పరిశ్రమలో నెలకొన్న అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ భేటీ కోసం హైదరాబాద్ నుంచి పలువురు ప్రముఖ నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సచివాలయంకు వెళ్లారు. సమావేశంలో పాల్గొననున్న ప్రముఖులలో నాగవంశీ, బన్నీ వాసు, దిల్ రాజు, కేఎల్ నారాయణ, మైత్రి రవిబాబు, విశ్వప్రసాద్, సాహు, చెర్రీ, భరత్ (తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు), స్వప్న (వైజయంతి ప్రొడక్షన్స్), దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఈ భేటీ ద్వారా సినీ కార్మికుల సంక్షేమం, పరిశ్రమకు అవసరమైన మద్దతు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ పరిశ్రమకు ఇది కీలకమైన సమావేశంగా భావిస్తున్నారు.
Internal Links
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల ఊగిసలాట
External Links
ఏపీ ప్రభుత్వంతో కాసేపట్లో సినీ ప్రముఖుల భేటీ