AP Rains

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో, దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

అదే విధంగా, రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, కోస్తాంధ్రలో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని, ఎల్లుండి నుంచి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణశాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పాతపట్నంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

Internal Links:

తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవులు…

హైదరాబాద్ మెట్రో నాన్ స్టాప్ సర్వీసులు..

External Links:

మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *