గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. వరుణిడి ఉగ్రరూపంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వేల మంది వరదల్లో సర్వం కోల్పోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద మనసుతో ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో ఇప్పటికే రూ.కోటి విరాళం ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు. యంగ్ హీరో విశ్వక్ సేన్ విరాళం ఇచ్చాడు.
కాగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా రెండు రాష్ట్రాలకు 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోతున్నాయని, తమదైన శైలిలో సాయం చేస్తున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.