గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వారిని వివిధ శాఖలో సర్దుబాటు చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో గతంలో ఉన్న వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం మల్లి నియమించబోతుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామీణ ప్రాంతాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, గ్రామాలలో ఖరీదైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని, సంక్షేమ పథకాల అమలు అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, చాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రభుత్వ దృష్టికి రావడంతో వారిని తిరిగి వీఆర్వోలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలో మొత్తం 10,954 గ్రామ పంచాయితులు ఉండగా , డిగ్రీ పరీక్షలలో ఉతీర్ణలైన వారిని ఈ పోస్ట్ లోకి తీసుకోవాలని భూ పరిపాలన కమీషనర్ కు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఈ వీఆర్వోలను జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ గా పేరు మార్పు చేయునట్లు పలు వర్గాలు తెలుపుతున్నాయి. ఒకవేళ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు కొంత ఉపశమనం లభిస్తుంది.