Bay of Bengal: శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆపై తమిళనాడు తీరం వైపు వెళ్లవచ్చని పేర్కొంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని, తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.
ఇదిలా ఉండగా, వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడవచ్చని, శనివారం దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో చలి కొంత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం