జెహనాబాద్ జిల్లాలోని వనవార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తెల్లవారుజామున 1.00 గంటకు విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో 16 మంది గాయపడినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు.. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. వేంటనే క్షతగాత్రులను సదర్ ఆసుపత్రికి తరలించారు.
శ్రావణ మాసం రెండో సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి చేరుకున్నారు . ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడం, సమయం గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు వచ్చి చేరుతుండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.