Breaking Latest Telugu

News5am, Breaking Latest Telugu (30-05-2025): 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 2025 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతంగా రాణించాడు. జెడ్డాలో జరిగిన వేలంలో రూ.1.1 కోట్లకు కొనుగోలయ్యిన అతను, 13ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతీరుతో 252 పరుగులు సాధించాడు. 206.55 స్ట్రైక్ రేట్‌తో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌లో రాణించాడు. గుజరాత్ టైటాన్స్‌పై అర్ధ సెంచరీతో పాటు 35 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ సాధించిన యువ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

తాజాగా మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 33 బంతుల్లో 57 పరుగులు చేసి సీజన్‌ను ముగించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడంతో వైభవ్ స్వస్థలానికి తిరిగొచ్చాడు. స్వస్థలమైన పాట్నాలో తల్లిదండ్రులతో కలిసి ప్రధాని మోడీని ఎయిర్‌పోర్టులో కలిసాడు. చిన్న వయసులోనే గొప్ప ఆటతీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న వైభవ్‌ను మోడీ కూడా అభినందిస్తూ, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

More Breaking Latest Telugu:

General Latest Telugu:

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత‌‌‌‌‌‌, సౌదీ ఆసుపత్రిలో చేరిక..

వాయుగుండంగా మారిని తీవ్ర అల్పపీడనం..

More Breaking Latest Telugu: External Sources

మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *