News5am, Breaking Latest Telugu News (09-06-2025): తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమైనట్టు చెప్పింది. జూన్ 9న వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 10న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో సాధారణంగా జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే చివరిలోనే వాతావరణం కొంత చల్లబడింది. ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతకు లోనయ్యారు. ఇప్పుడు వర్షాల హెచ్చరిక ప్రజలకు ఊరట కలిగించవచ్చు. అయితే పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
More Latest Weather News:
Breaking Latest Telugu News:
తెలంగాణలో నాలుగురోజులు వర్షాలు..