News5am, Breaking News Latest (14-06-2025): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశయాలను కొనసాగించేందుకు గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసింది. గతంలో గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు భాషా, సాంస్కృతిక శాఖ నిధుల మంజూరుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ తెలంగాణ ఉద్యమం మరియు సాంస్కృతిక రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.
అలాగే, గద్దర్ జయంతి వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్‌ను భాగస్వామిగా చేర్చేందుకు మరో ఉత్తర్వు జారీ చేశారు. మరోవైపు, గద్దర్ పేరిట ప్రత్యేక సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ హైటెక్స్ వేదికగా జరగనున్న వేడుకల్లో విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
More Breaking Latest:
Breaking News Latest:
జూన్ 12 నుంచి స్టూడెంట్ బస్పాస్ల జారీ..
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ సీఎం విజయ్ రూపానీ..
More Breaking News Latest: External Sources
గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు..