News5am, Breaking News Telugu News (06/05/2025): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో భూమి కొద్ది సెకన్ల పాటు కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనల సమయంలో పెద్ద శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తతతో స్థానికులు ఒకరికి ఒకరు సమాచారం ఇచ్చుకుంటూ బయటికి వచ్చారు.
ఇక సోమవారం తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడంతో, ఏమి జరుగుతుందో అర్థం కాక స్థానికులు బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ప్రకంపనల ప్రభావం మరింతగా కనిపించిందని తెలుస్తోంది.
More News:
Breaking News Telugu:
మోహన్ లాల్ సినిమా సరికొత్త రికార్డ్..
ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ…
More Breaking Big News: External Sources
Earthquake: ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు