News5am,Breaking News Telugu Latest(24-05-2025): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగా ఈసారి కేరళలోకి ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి కూడా ఈ రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఈరోజు ఉత్తర తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేయగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆదివారం నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మార్చి 27 నాటికి పశ్చిమ మధ్య మరియు ఉత్తర బంగాళాఖాతం సమీపంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, అది మరింత బలపడితే స్పష్టమైన అల్పపీడనంగా మారి, 27 నుంచి తెలంగాణలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
More News:
Breaking News Telugu Latest
మైక్రోసాఫ్ట్ ‘అరోరా’: ఒక సరికొత్త ఏఐ మోడల్
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు..
More Weather News Telugu: External Sources
ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు..