News5am, Breaking News Telugu News (03/05/2025) : తెలంగాణలో రేషన్ షాపుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ, అర్హులైన లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా కొత్త లబ్దిదారులు చేరగా, పాత కార్డుల్లో అదనంగా 10 లక్షల 12 వేల మంది పేర్లు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం లబ్దిదారుల సంఖ్య రెండు కోట్లను అధిగమించింది.
లబ్దిదారుల సంఖ్య పెరుగడంతో నెలనెలకు సన్నబియ్యం సరఫరా కూడా పెరుగుతోంది. జనవరిలో 1,79,175 టన్నుల బియ్యం పంపిణీ కాగా, ఫిబ్రవరిలో ఇది 1,79,723 టన్నులకు చేరింది. మార్చిలో 1,80,005 టన్నులుగా నమోదు కాగా, మేలో కోటి 80 లక్షల టన్నులకు చేరింది. ఇది ప్రభుత్వ ప్రజాభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
More News:
Breaking News Telugu:
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..
రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు…
More Breaking Big News: External Sources
కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం..తెలంగాణలో రేషన్ పండగ..