News5am, Breaking News Telugu News (06/05/2025): హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా సంకేతాలు వస్తున్నాయి. మెట్రో అధికారుల సమాచారం మేరకు, మే రెండో వారంలో కొత్త టికెట్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ అమెరికాలో ఉన్నారు. ఆయన భారత్‌కు వచ్చిన తర్వాతే ఛార్జీల పెంపు గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ టారిఫ్ సవరణల ద్వారా ఏటా అదనంగా రూ.150 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల పెంపు గురించి ఇప్పటికే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా సమాచారం అందించింది.
ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ధర రూ.10గా, గరిష్ఠ ధర రూ.60గా ఉంది. ఇప్పుడు ఈ గరిష్ఠ ఛార్జీని రూ.75 వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం, మెట్రో రైలు సేవలతో పాటు ప్రకటనలు, షాపింగ్ మాల్స్ అద్దె వంటి ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ఏటా సుమారు రూ.1500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేస్తోంది. అయితే నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు, బ్యాంకులకి చెల్లించే వడ్డీలు వంటి వ్యయాలతో సంస్థకు సంవత్సరానికి సుమారు రూ.2000 కోట్ల ఖర్చు జరుగుతోందని సమాచారం.
More News:
Breaking News Telugu:
మోహన్ లాల్ సినిమా సరికొత్త రికార్డ్..
ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ…
More Breaking Big News: External Sources
Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఛార్జీలు పెంపు..