News5am, Breaking Telugu News(28-04-2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15 వరకు శ్రీ‌వారి బ్రేక్ దర్శనాలను స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. సాధారణ భక్తులకు మరింత సౌకర్యం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు.

ఈ ప్రయోగాత్మక విధానంలో భాగంగా, బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభించి పది గంటలకల్లా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఇవి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతున్నాయి. తాజా నిర్ణయంతో ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫారసు లేఖలను మంజూరు చేయరని టీటీడీ స్పష్టం చేసింది.

More Breaking Telugu News:

3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు..

మిస్ వరల్డ్ 2025 కోసం హైదరాబాద్ సిద్ధం..

More Breaking News Latest: External Sources:

కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ – మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు – TTD ON DEVOTEES BREAK DARSHAN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *