Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తుల భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో మేడారం స్పెషల్ బస్సులను ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా 4,000 ఆర్టీసీ బస్సులను కేటాయించినట్లు తెలిపారు. అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామని, భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.
ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉండటంతో పాటు నేరుగా అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లే సౌకర్యం ఉందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఆర్టీసీని వినియోగించాలని కోరారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌తో ప్రత్యేక బ్యాండ్‌ను కడతామని, జాతర ముగిసే వరకు బస్సు సేవలు కొనసాగుతాయని భరోసా ఇచ్చారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
సమ్మక్క -సారలమ్మ జాతరకు 4 వేల బస్సులు