News5am,Breaking Telugu New (05-05-2025): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడతో పాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు నమోదవుతున్నాయి. గన్నవరం, నందిగామ, తిరువూరు, చందర్లపాడు మండలాల్లోని ఏటూరు గ్రామంలో ఈదురు గాలుల ప్రభావంతో వినాయకుని ఆలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది. అలాగే, ఏ. కొండూరు మండలంలోని గోపాలపురం-కంభంపాడు మధ్య జాతీయ రహదారిపై గాలివాన బీభత్సానికి భారీ చెట్లు నేలకూలాయి.

ఈ పరిస్థితుల్లో, హైవే పెట్రోలింగ్ పోలీసులు స్థానికుల సహాయంతో రంపకోత యంత్రాల ద్వారా చెట్లను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ పునరుద్ధరణ కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ వర్షాలు మరింత కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. అల్లూరి, అన్నమయ్య జిల్లాల్లో రైల్వేకోడూరులో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం పడటం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

More Breaking Telugu News

రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు…

నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…

More Breaking Telugu New: External Sources

Rain: ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *