News5am, Breaking Telugu Headlines (13-05-2025): నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, అలాగే వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికై పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష మంగళవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థులను పరీక్షకు ఒక గంట ముందుగానే అనుమతించనున్నందున, వారు ఉదయం 10:00 గంటలకే పరీక్ష కేంద్రంలో హాజరుకావలసి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వబడదు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా HB బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తీసుకెళ్లాలి. హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే, ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని తెలుసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ నుండి SBTET TG యాప్‌ను డౌన్లోడ్ చేసి, అందులో POLYCET Exam Center Locator టాబ్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ వారి వివరాలు నమోదు చేస్తే పరీక్షా కేంద్రం స్థానం మరియు దానివైపు వెళ్లే మార్గం సులభంగా గుర్తించవచ్చు.
More News
Breaking Telugu Headlines
నేడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష..
భారత్–పాక్ సీజ్‌ఫైర్‌తో బుల్స్ జోరు..
More Breaking Telugu New: External Sources
నేడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష..