News5am, Breaking Telugu News 5 (22-05-2025): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు మరియు పోలీస్ బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మరణించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక ‘జంగ్’ ఎడిటర్ నవీన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.
నంబాల కేశవరావు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు. టెక్కలి తలగాం హైస్కూల్, టెక్కలి జూనియర్ కళాశాలలో చదివిన కేశవరావు, వరంగల్ R.E.C లో బీటెక్ చదువుతున్నారు. చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్యూ)తో చేరి, 1984లో సీపీఐ పీపుల్స్ వార్ భావజాలానికి ఆకర్షితుడై ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్ల పాటు అజ్ఞాతంలో మావోయిస్టుగా ఉన్నారు. గెరిల్లా యుద్ధం, బాంబులు తయారీలో నిపుణుడైన ఆయన, పలు రాష్ట్రాలలో జరిగిన మావోయిస్టు దాడుల ప్రధాన సూత్రధారి. 2004లో సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా నియమితులైన కేశవరావుపై ₹1.5 కోట్లు రివార్డు ఉంది.
More Telugu News:
Breaking Telugu News 5
హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం
More Breaking General News: External Sources
బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!