ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు అయినట్లు సిటీ పోలీస్ కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సీబీఐ అధికారులు నగర పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నారు.

అయితే, ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ అధికారి మరియు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత సంభాషణలు దొంగలించినట్లు వెల్లడైంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అసలు విషయం బయటకు రావడంతో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసమని అమెరికాకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *