News5am,Breaking Telugu News Updates (13-05-2025): మిస్ వరల్డ్ 2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 109 దేశాల నుండి వచ్చిన సుందరీమణులు నలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకుంటారు. పాతబస్తీ ప్రాంతానికి ప్రత్యేకతనిచ్చే మార్ఫా వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత, చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్ చేస్తారు.
ఈ షాపింగ్‌లో పాల్గొనే దుకాణాలు: హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కన్హయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కెఆర్ కాసత్, జాజు పెరల్స్, ఏహెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే. మిస్ వరల్డ్ అభ్యర్థులు ఈ సందర్భంగా గాజులు తయారు చేసే ప్రక్రియను కూడా ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం చౌమల్లా ప్యాలెస్‌లో ఏర్పాటైన విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మెహందీ వేయించుకునే ఏర్పాట్లూ చేశారు. అలాగే, వారు నిజాముల సంప్రదాయ దుస్తులు ధరించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల విశిష్టతను చాటి చెప్పే సినిమాలు ప్రదర్శించనున్నారు. చౌమల్లా ప్యాలెస్‌లో జరిగే వెల్కమ్ డిన్నర్ సందర్భంగా, చార్మినార్ జోన్ పరిధిలోని ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు సమాచారం.
More Breaking Telugu News
Breaking Telugu News Updates
నేడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష..
భారత్–పాక్ సీజ్‌ఫైర్‌తో బుల్స్ జోరు..
More Breaking Telugu New: External Sources
Miss World 2025: చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్