సత్యసాయి జిల్లా, కదిరి సమీపంలోని కుటాగుళ్ల గ్రామంలో నర్సమ్మ హోటల్ ఉంది. రోజుకు 10 వేలు, సుమారు నెలకు రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతుందని నర్సమ్మ తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం సజావుగా సాగుతుందని చెబుతున్నారు. నర్సమ్మ హోటల్ లో రకరకాల దోసెలు అమ్ముతారు. గుడ్డు దోసెలు రూ. 25, సాధారణ దోసెలు రూ. 10, కూర దోసెలు రూ.25. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అమ్మకాలు జరుగుతాయని నర్సమ్మ తెలిపారు.
ఈ హోటల్‌లో గుడ్డు దోసె ప్రసిద్ధి అని నర్సమ్మ చెప్పింది. వ్యాపారం బాగానే ఉంటుందని నర్సమ్మ చెబుతోంది. తాను చేసే దోసె పిండి, రుచికరమైన చట్నీల వల్ల కస్టమర్లు తరచూ వస్తుంటారని నర్సమ్మ చెబుతోంది. ముడిసరుకు ఖర్చులు కలుపుకుని రోజుకు రూ.10 వేల వరకు వ్యాపారం జరుగుతుందన్నారు.