ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని తెలిసిందే. తాను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, అయితే కలలో కూడా పవన్ కల్యాణ్‌ను మాత్రం విమర్శించనని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఈయన గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణం పోయినా తాను పవన్‌ను విమర్శించనన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదన్నారు. తన మనసుకు నచ్చకుంటే దేవుడినైనా ఎదిరిస్తానని, నచ్చితే కాళ్లు పట్టుకుంటానన్నారు. తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా పవన్ కల్యాణ్‌ను విమర్శించనన్నారు. తన ఇంట్లో, బెడ్రూంలో కూడా ఆయన ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *