తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ పదవీ విరమణ అనంతరం శాంతి కుమారి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎస్ నియామకం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆర్థిక శాఖలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు, 1991 బ్యాచ్‌కు చెందిన అధికారి. అనుభవం, సమర్థత దృష్టిలో ఉంచుకొని ఆయనను కొత్త సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.