వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన అన్ని కేసులను రద్దు చేయాలని వర్మ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నేడు హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన కారణంగా రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. మద్దిపాడు పోలీసులు విచారణకు పిలిచినప్పటికీ, వర్మ హాజరు కాలేదు. హైదరాబాద్‌లో ఆయన కోసం వెళ్లిన పోలీసులకు సెర్చ్ వారెంట్ లేకపోవడంతో విచారణ ఆగిపోయింది. నేడు హైకోర్టు ఈ కేసుపై నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.