తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను నడుపుతున్న అధికారులు, సిబ్బందికి ప్రయాణికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే, ఆర్టీసీ ఆదాయంపై కూడా దృష్టి సారించింది.ఇంతకుముందు కార్గో సేవలను ప్రవేశపెట్టారు. కార్గో మరియు పార్సిల్ తక్కువ ఖర్చుతో వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపుతుంది. అయితే, ఈ కార్గో సేవలను బలోపేతం చేయడంపై సంస్థ దృష్టి సారించింది

తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్గో సేవలను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ప్రస్తుత కార్గో మరియు పార్సిల్‌ సేవలు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఆదాయ మార్గాలు, స్థితిగతులపై సమీక్షించి చర్చించారు. బస్టాండ్‌లు కాకుండా, ప్రైవేట్ పార్సిల్ సేవలతో ఇంటింటికీ. సేవలందించేలా లాజిస్టిక్‌ విభాగాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఈ మేరకు ఇళ్ల వద్దే బుకింగ్‌లు తీసుకుని తిరిగి ఇళ్లకే పార్సిళ్లను డెలివరీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. మరో వారం, పది రోజుల్లో ఈ కొత్త కార్గో సర్వీసు ప్రక్రియ రానుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *