DRDO CEPTAM 11 Recruitment: ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారికి డీఆర్‌డీఓ మంచి అవకాశం ఇచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) CEPTAM-11 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులు 561, టెక్నీషియన్-ఎ పోస్టులు 203 ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు ఆటోమొబైల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్-ఎ పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 12వ తరగతి లేదా ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి.
అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీలకు వయోసడలింపు వర్తిస్తుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు, టెక్నీషియన్-ఎ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు జనవరి 1, 2026 వరకు అప్లై చేయవచ్చు. ఫీజు చెల్లింపుకు జనవరి 3 రాత్రి 11:55 వరకు అవకాశం ఉండగా, జనవరి 4 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
DRDO లో 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు..