E Aadhar App: భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం ఒక కొత్త మొబైల్ యాప్‌ను తీసుకురాబోతోంది. UIDAI అభివృద్ధి చేస్తున్న ఈ యాప్ ద్వారా పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను సులభంగా స్మార్ట్‌ఫోన్ నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతో ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫేస్ ఐడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఈ యాప్ దేశవ్యాప్తంగా సురక్షితమైన డిజిటల్ సేవలను అందిస్తుంది. నవంబర్ నుండి వినియోగదారులు బయోమెట్రిక్ ధృవీకరణ కోసం మాత్రమే ఆధార్ సెంటర్లను సందర్శించాల్సి ఉంటుంది. ఈ కొత్త చర్య వల్ల పేపర్ వర్క్ తగ్గి, మోసాలు కూడా తగ్గనున్నాయి.
అదనంగా, ఈ యాప్ వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్లతో లింక్ అయి బర్త్ సర్టిఫికెట్లు, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, MNREGA రికార్డ్స్ వంటి డాక్యుమెంట్స్‌ను ఆటోమేటిక్‌గా అందుబాటులోకి తెస్తుంది. చిరునామా ధృవీకరణ కోసం కరెంట్ బిల్లు వివరాలు కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ఆధార్ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేలా సహాయపడుతుంది.
Internal Links:
తెలంగాణ రాష్ట్రంకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక..
External Links:
ఆధార్ సమస్యలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త యాప్.. ఇప్పుడు అరచేతిలోనే అన్ని..