హైదరాబాద్: గత కొన్ని నెలలుగా, టాస్క్‌ఫోర్స్ బృందం వివిధ రెస్టారెంట్లు, పీజీలు హాస్టళ్లలో ఆహార నాణ్యతను నిర్వహించేలా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చాలా హెటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రత పాటించడం లేదు. కుళ్లిన చికెన్, మటన్ కు మసాల దట్టించి కస్టమర్లకు అందిస్తున్నారు. స్వీట్ షాపుల్లో కూడా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి . కృత్రమ కలర్లు ఉపయోగించడం, తేదీ ముగిసిన పదార్థాలు వాడడం కూడా గుర్తించిన విషయం తెలిసిందే.
తాజాగా నారాయణగూడలోని మెహ్రాబ్ రెస్టారెంట్, రాజేంద్రనగర్, ఇండియా దర్బార్ రెస్టారెంట్ సహా రెండు వేర్వేరు ప్రాంతాల్లో తెలంగాణ ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి చిన్నపాటి ఉల్లంఘనలను గుర్తించింది. FSSAI ప్రారంభించిన ఆహార భద్రత సమ్మతి వ్యవస్థ అయిన FoSCoS యాప్ ద్వారా టాస్క్ ఫోర్స్ కస్టమర్ల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. దీనిని అనుసరించి, FSS చట్టం, 2006 మరియు నియమాలు మరియు నిబంధనలు, 2011 ప్రకారం రెండు రెస్టారెంట్‌లలో ఆహార భద్రత విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం చిన్న చిన్న ఉల్లంఘనలను గుర్తించింది. రెండు ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.