Good News for Public: తయారీదారులు అమ్ముడుపోని స్టాక్‌పై జీఎస్‌టీ కొత్త రేట్ల ప్రకారం గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ)ను సవరించుకోవడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ సెప్టెంబర్ 9న అనుమతించింది. ఈ నిర్ణయం వినియోగదారులు, కంపెనీలకు ఊరట కలిగిస్తుంది. జీఎస్‌టీ రేట్లు మారకముందు తయారు చేసిన లేదా దిగుమతి చేసిన అమ్ముడుపోని ప్యాకేజ్డ్ వస్తువులపై తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కొత్త ఎంఆర్‌పీని తప్పనిసరిగా ప్రకటించాలి. ఇందుకోసం స్టాంపింగ్, స్టిక్కర్ అతికించడం లేదా ఆన్‌లైన్ ప్రింటింగ్ పద్ధతులను ఉపయోగించాలి.
అసలు ఎంఆర్‌పీ కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ధర సవరణ వివరాలను తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కనీసం రెండు వార్తాపత్రికల్లో ప్రకటనల రూపంలో ప్రకటించాలి. అలాగే డీలర్లకు, కేంద్ర ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ డైరెక్టర్‌కి, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లీగల్ మెట్రాలజీ కంట్రోలర్లకు నోటీసులు పంపాలి. ఈ అనుమతి 2025 డిసెంబర్ 31 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అది అమల్లో ఉంటుంది.
Internal Links:
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు..
తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవులు…