జంటనగరాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్ బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంక్ బండ్ కు 1850 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 1600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జారీ చేశారు.. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్అ లర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సిటీ రోడ్లు జలమయంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తుండడంతో వరద నీరు హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది. దీంతో గంటగంటకూ ట్యాంక్ బండ్ లో నీటిమట్టం పెరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.