Heavy Rain Alert: బంగ్లాదేశ్ – పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య ఏర్పడిన వాయుగుండం జూలై 25న ఉదయం భూ ఉపరితలాన్ని తాకింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఝార్ఖండ్ పరిధిలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఇది ఉత్తర భారతదేశం మీదుగా మరికొన్ని గంటల పాటు కొనసాగి తరువాత బలహీనపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొంతమంది జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఇక, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, పోర్టు అధికారులు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు, పడవలు, నౌకల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, వచ్చే వారం బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంగా వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
Internal Links:
External Links:
ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!