Heavy Rainfall In Mumbai

Heavy Rainfall In Mumbai: ముంబైను ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులు చెరువుగా మారడంతో ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి నగరం తీవ్రంగా ప్రభావితమైంది. ముంబైలో ఆదివారం ఉదయం 8:30 నుంచి సోమవారం ఉదయం 5:30 వరకు కొలాబా 88.2 మి.మీ, బాంద్రా 82 మి.మీ, బైకుల్లా 73 మి.మీ, టాటా పవర్ స్టేషన్ 70.5 మి.మీ, జుహు 45 మి.మీ, శాంటాక్రూజ్ 36.6 మి.మీ, మహాలక్ష్మి స్టేషన్లలో 36.5 మి.మీ వర్షం నమోదైంది. పూణె శివారు ప్రాంతాల్లోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించబడ్డాయి.

కేంద్ర వాతావరణ శాఖ రాబోయే 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముంబైకు రెడ్ అలర్ట్, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, పూణె, లాతూర్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి కాకుండా బయటకు రాకూడదని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

Internal Links:

సిటీతో పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

సామాన్యులకు గుడ్ న్యూస్, పాత స్టాక్ కూడా కొత్త జీఎస్టీ రేట్లకు అమ్మాల్సిందే..

External Links:

ఆర్థిక రాజధాని ముంబైను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *