Heavy Rainfall Warning: తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా ఉండొచ్చని తెలిపింది. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది.
గత వారం రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మాత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గంటల్లోనే కొన్ని చోట్ల 15 సెంమీ వర్షపాతం నమోదైంది. రహదారులు చెరువుల్లా మారిపోయాయి. ట్రాఫిక్ అర్ధరాత్రి వరకు నిలిచిపోయింది. నాలాలు పొంగిపొర్లాయి. వరద నీటితో కొన్ని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
Internal Links:
ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత…
శాంతను నాయుడు రోస్ట్స్ జెమినీ ఏఐ శారీ ట్రెండ్…
External Links:
రానున్న 3 గంటల్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక!