Yellow Alret to Hyderabad

Heavy Rains in Next 3 hours: తెలంగాణలో జులై 23న భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వచ్చే 2-3 గంటల్లో జనగాం, కరీంనగర్, మెదక్, ములుగు, సిద్ధిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాలు, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ గంటకు 40 కి.మీ కంటే తక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక రామగుండం సింగరేణిలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో రోజుకు సగటున 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలన్నీ జలమయంగా మారడంతో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి.

Internal Links:

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..

దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

External Links:

మరో మూడు గంటలు భారీ వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *