Heavy Rains In Telangana

Heavy Rains In Telangana: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ద్రోణి మరింత బలపడడంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం నుండి అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. నేడు, రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక ఇచ్చారు. మిగతా జిల్లాల్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు.

గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కొన్ని ప్రాంతాల్లో వరదలా నీరు నిలవడంతో రహదారులు చెరువుల్లా మారి, వాహనాలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, నేడు నగరంలో గురువారం నాటి దారుణ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి, సాయంత్రం తర్వాత కొన్నిచోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

Internal Links:

ఎస్బీఐలో 6,589 క్లర్క్ ఉద్యోగాలు..

అవయవ దానంలో తెలంగాణ ఫస్ట్..

External Links:

వదల బొమ్మాలి.. వదల.. తెలంగాణను వదలనంటున్న వరణుడు.. మరో రెండు రోజులు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *