తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) శుభవార్త ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుండి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా, ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ కళాశాలలకు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలని సూచనలు జారీ చేసింది.

విద్యార్థులు వేసవి సెలవులను స్వీయ అధ్యయనం, నైపుణ్యాల అభివృద్ధి, ఇతర ప్రయోజనకరమైన కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించింది. జూన్ 2, 2025 నుంచి తరగతులు మళ్లీ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. అలాగే, సెలవుల సమయంలో అనధికారికంగా తరగతులను నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *